ఎక్స్‌క్లూజీవ్‌: గ‌ప్ చుప్ గా ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ – హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. మ‌ధురైలో కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ప్ర‌భాస్ మాత్రం సెట్‌లో లేడు. ఆయ‌న ప్ర‌స్తుతం ‘రాజాసాబ్తో’ బిజీగా ఉన్నారు. ‘రాజాసాబ్‌’ షెడ్యూల్ పూర్తయిన త‌ర‌వాతే… ప్ర‌భాస్ హ‌ను సినిమా సెట్లోకి అడుగు పెడ‌తారు. మ‌ధురై షెడ్యూల్ లో ప్ర‌భాస్ పై తెర‌కెక్కించే స‌న్నివేశాలేం లేవ‌ని స‌మాచారం. ఓ వారం రోజుల పాటు చిత్ర‌బృందం మ‌ధురైలోనే ఉంటుంది.

1945 నేప‌థ్యంలో సాగే క‌థ ఇద‌ని స‌మాచారం. ఈచిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. దాన్నే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌భాస్ పై చిత్ర‌బృందం ఇది వ‌ర‌కే ఓ ఫొటో షూట్ నిర్వ‌హించింది. చిన్న గ్లింప్స్ కూడా డిజైన్ చేసింది. ద‌స‌రాకు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ చిత్రంలో మిధున్ చ‌క్ర‌వ‌ర్తి ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్ర‌భాస్ కు తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇమాన్వీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. కె.కె సాహిత్యాన్ని అందించారు. ఇప్ప‌టికే రెండు పాట‌ల్ని రికార్డ్ చేసిన‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close