ప్రభాస్ కి మోకాలి గాయం ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతోంది. బాధను ఓర్చుకుంటూనే ‘సలార్ ‘సినిమాని పూర్తి చేశారు. తర్వాత యూరప్ లో సర్జరీ చేసుకొని అక్కడే దాదాపు నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకున్నారు. గత ఏడాది ఆయన బర్త్ డే వెనుకలు కూడా అక్కడే జరిగాయి. అంతా సర్దుకుందని అనుకుంటున్న సమయంలోఇప్పుడు మరోసారి ఆయన గాయం తిరగబెట్టిందని సమాచారం. దీంతో మరోసారి ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్ళబోతున్నట్టు టాక్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావస్తోంది. మే9.. విడుదల తేది కూడా ఇచ్చారు. ఈలోగ కాస్త బ్రే తీసుకొని చికిత్సకు సిద్ధమౌతున్నారని తెలుస్తోంది.