‘రాజాసాబ్’.. రీ ఎంట్రీ!

ప్ర‌భాస్ – మారుతి కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘రాజాసాబ్’. ప్ర‌భాస్ బిజీ బిజీగా ఉండ‌డం వ‌ల్ల ‘రాజా సాబ్’ చిన్న చిన్న షెడ్యూల్స్ తో స‌రిపెట్టుకొంటోంది. తాజాగా శుక్ర‌వారం నుంచి ఓ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈనెల 16 వ‌ర‌కూ ఈ షెడ్యూల్ కొన‌సాగ‌బోతోంది. ఇందుకోసం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఓ ప్ర‌త్యేక సెట్ తీర్చిదిద్దారు. అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. సంజ‌య్‌ద‌త్‌, ఇతర ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్ లేడు. ఇదే నెల‌లో మ‌రో ద‌ఫా ‘రాజా సాబ్’ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ప్ర‌భాస్ కూడా షూటింగ్ లో పాలు పంచుకోనున్నాడ‌ని తెలుస్తోంది. ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ లో సాగే హార‌ర్‌, థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. ప్ర‌భాస్‌కి ఇలాంటి జోన‌ర్లు కొత్త‌. అయితే.. మారుతి ఇది వ‌ర‌కు ‘ప్రేమ‌క‌థా చిత్రమ్`తో ఈ జోన‌ర్‌లో త‌న‌కున్న ప‌ట్టుని నిరూపించుకొన్నాడు. హార‌ర్ సినిమా అని రెగ్యుల‌ర్ పేట్ర‌న్ ఫాలో అవ్వ‌కుండా ప్ర‌భాస్ ఇమేజ్‌నీ, క్రేజ్‌నీ దృష్టిలో ఉంచుకొని, క‌థ‌, క‌థ‌నాలు ప‌క‌డ్బందీగా త‌యారు చేసుకొన్నాడు మారుతి. ముఖ్యంగా ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వేరే లెవ‌ల్‌లో ఉండ‌బోతున్నాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొనిరావ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close