`మిర్చి`తో రచయిత కొరటాల శివ.. దర్శకుడిగా మారాడు. అప్పటి నుంచీ… సినిమా సినిమాకీ ఓ మెట్టు పైకి ఎక్కుతూనే ఉన్నాడు. 100 % సక్సెస్ రేటు ఉన్న అతి కొద్దిమంది దర్శకులలో తానొకడు. మిర్చి తరవాత.. ప్రభాస్ తో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.కానీ కుదరడం లేదు. అయితే తాజాగా.. ప్రభాస్ – కొరటాల మధ్య ఓ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొరటాల.. ప్రభాస్‌కి ఓ కథ చెప్పాడని టాక్. ప్రభాస్ కూడా కొరటాలతో సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడట. యూవీ బ్యానర్లోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే… ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడిప్పుడు. త్వరలోనే మారుతి సినిమా పట్టాలెక్కిస్తాడు. ప్రాజెక్ట్ కె.. ఉండనే ఉంది. సలార్…ఇంకా సెట్స్ పైనే ఉంది. వీటిమధ్య కొరటాలకు డేట్లు ఎప్పుడిస్తాడో చూడాలి. మారుతి లానే.. అతి త్వరగా సినిమాని పూర్తి చేస్తా అని కొరటాల మాట ఇస్తే.. ప్రాజెక్ట్ కె..తోనే ఈసినిమానీ సమాంతరంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కినా.. యూవీ క్రియేషన్స్ సంస్థనే నిర్మించబోతోంది.