బాహుబలి తెచ్చిన క్రేజ్ తో ప్రభాస్ కంపెనీలకు బ్రాండ్ ఎంబాసిడర్ గా కూడా ఉంటున్న సంగతి తెలిసిందే. మహింద్ర అండ్ మహింద్ర కంపెనీకి బ్రాండింగ్ ఉన్న ప్రభాస్ మహింద్రా టియూవి 300 కార్ యాడ్ నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి వాణిజ్య ప్రకటనైనా యంగ్ రెబర్ స్టార్ అదరగొట్టాడనే చెప్పాలి. బాహుబలి ప్రభాస్ యాడ్ అనగానే బాలీవుడ్లో సూపర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఆ అంచనాలను అందుకునేలా యాడ్ ఎక్సలెంట్ గా వచ్చింది.
కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో కిడ్నాపర్ల నుండి పిల్లాడిని రక్షించేలా థీం కొనసాగుతుంది. డైరక్టర్ షాట్ ఓకే అన్నా సరే వన్ మోర్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ని ఉత్సాహాన్నిస్తుంది. స్టైలిష్ లుక్ తో బ్రాండింగ్ కే బ్రాండ్ అంబాసిడర్ లా కనిపిస్తున్న ప్రభాస్ ఇక మీదుట యాడ్లలో కూడా తన సత్తా చాటనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ యాడ్ చూసి సిని ప్రముఖుల నుండి కూడా ప్రసంశలు అందుకుంటున్నాడు ప్రభాస్.
ప్రస్తుతం బాహుబలి-2 ప్రి ప్రొడక్షన్ పనిలో ఉన్న బాహుబలి టీం అంతా మళ్లీ షూటింగ్ షురూ చేసే టైం దగ్గర పడుతుంది. ఆల్రెడీ బాహుబలి-2 కి సంబంధించిన 30 శాతం షూటింగ్ ఇంతకుముందే అవ్వడం విశేషం. ప్రభాస్ ని మహింద్ర బాహుబలిగా మరోసారి చూడటానికి చాలా టైం పడుతుంది అందుకే ఫ్యాన్స్ కు ఈ యాడ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు ప్రభాస్.
[youtube http://www.youtube.com/watch?v=ALD72k9ZuJk&w=640&h=360]