ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దానయ్య నిర్మాత. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లంటూ ప్రచారం జరుగుతోంది. ఓ కథానాయికగా శ్రీలీలని ఎంచుకున్నారు. పెళ్లి సందడితో ఫేమ్ లోకి వచ్చింది ఈ భామ. ఇప్పుడు తన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. అందులో ప్రభాస్ సినిమా ఒకటి. ఇప్పుడు రెండో కథానాయిక అన్వేషణ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఆ స్థానం మాళవికా మోహన్ కి దక్కిందన్నది టాలీవుడ్ టాక్.
విజయ్ తో `మాస్టర్`లో నటించి పేరు తెచ్చుకుంది మాళవిక. అంతకు ముందు పెట్టాలో చేసింది. కొన్ని హిందీ సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది. మాళవిక మోహనన్ ని తెలుగులో ఒకట్రెండు సినిమాల కోసం సంప్రదింపులు జరిపారు. కానీ.. కుదర్లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాతో తెలుగు డెబ్యూ చేయబోతోంది. ఇద్దరు హీరోయిన్లు దొరికేశారు కాబట్టి, మూడో హీరోయిన్ ఒక్కర్తే పెండింగ్లో ఉన్నట్టు. శ్రీలీల, మాళవిక ఇద్దరూ కొత్త అమ్మాయిలే కాబట్టి… ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవడం తప్పనిసరి. ఆ స్టార్ హీరోయిన్ ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.