బాక్సాఫీసు దగ్గర సలార్ విజృంభణ కొనసాగుతోంది. ఈ యేడాది చివరి వరకూ సలార్‌కు బాక్సాఫీసు దగ్గర ఎదురు లేకపోవొచ్చు. ఈ సంక్రాంతి సైతం ప్రభాస్ అభిమానులకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఈ పండక్కే విడుదల చేయబోతున్నారు.
ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై చాలా కాలం అయ్యింది. అయితే… చిత్రబృందం నుంచి ఎలాంటి అప్డేటూ రాలేదు. టైటిల్ కూడా ఏమిటన్నది చెప్పలేదు. కనీసం సినిమా పోగ్రెస్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. సలార్ వచ్చి, వెళ్లిపోయిన తరవాతే.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు మొదలెట్టాలని భావించారు. ఇప్పుడు సలార్ విడుదలైపోయింది. అందుకే మారుతి అండ్ టీమ్ కూడా తమ సినిమా అప్ డేట్ రెడీ చేసేసింది. ఈ సంక్రాంతికి ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది. టైటిల్ కూడా అదే రోజున ప్రకటిస్తారు. ఇటీవల ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. సంజయ్‌దత్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. జనవరి 20 నుంచి మరో షెడ్యూల్ మొదలు కానుంది. అప్పటి నుంచి ఇక రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.