ఆదిపురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కె .. ఈ మూడే కాకుండా .. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఇప్పటికే కథ లాక్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే .. 18౦౦౦ చదరపు అడుగుల లావిష్ ఇంటి సెట్లలో ని ఈ సినిమా కోసం నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ ఈ సెట్ లో ఉంటుందని సమాచారం. మారుతి కాన్సెప్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి . అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలు బాగా అలసస్యం అవుతున్నాయి. ప్రాజెక్ట్ ఈజీ గా రెండేళ్లు పైన పట్టేస్తుంది . ఐతే మారుతి సినిమా కేవలం ఆరు నెలలనెలలో పూర్తి చేయలని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా పరిమిత డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. కరెక్ట్ ప్లానింగ్ తో దిగి అనుకున్న సమయానికి సినిమాని ఫినిష్ చేసేయాలని టార్గెట్ లో వున్నారు మారుతి.