సాహోతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. మరోవైపు మరో సినిమాని మొదలెట్టేస్తున్నాడు. `జిల్` దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈనెల 6న హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సాహో షూటింగ్ పూర్తయిన తరవాతే రాధాకృష్ణ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందా? లేదంటే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగులు సమాంతరంగా జరుగుతాయా అనేది చూడాలి. ప్రభాస్ ఉన్నా లేకున్నా… మిగిలిన తారాగణంతో అయినా షూటింగ్ మొదలెడతారని, ప్రభాస్ సాహో అయ్యాక టీమ్‌తో కలుస్తాడని తెలుస్తోంది. 1980 నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఇటలీలో తెరకెక్కిస్తారు. జాతకాలు, జ్యోతిష్యం… వీటికి సంబంధించిన అంశాల చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. టైటిల్ 6నే ప్రకటిస్తారా, లేదంటే… షూటింగ్ మొదలెట్టే వరకూ దాచి పెడతాడా? అనేది చూడాలి.