తన సినిమా రిలీజ్ అంటే చాలు… ఫారెన్ ట్రిప్ వేసేయ్యడం ప్రభాస్‌కు అలవాటే. ఈసారీ అదే జరుగుతోంది. సరిగ్గా ‘కల్కి’ రిలీజ్ రోజున ప్రభాస్ ఇండియా నుంచి ఇటలీ బయలు దేరుతున్నాడు. అక్కడ రెండు వారాల పాటు హాలీడేని ఎంజాయ్ చేసి, ఆ తరవాత ఇండియా తిరిగొస్తారు. ఈనెల 27న ‘కల్కి’ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఒక్క రోజు ముందు వరకూ ప్రమోషన్లకు కేటాయించిన ప్రభాస్, ఆ వెంటనే ఇటలీ విమానం ఎక్కేయబోతున్నాడు. ఆదిపురుష్, సలార్ విడుదలకు ముందు కూడా ప్రభాస్ ఇలానే ఇటలీ వెళ్లిపోయాడు.
ఇటలీలో ప్రభాస్‌కు ఓ పర్మినెంట్ గెస్ట్ హోస్ ఉంది. అక్కడే ప్రభాస్ ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా గడపబోతున్నాడు. తిరిగొచ్చాక ‘రాజాసాబ్’ షూటింగ్లో పాలు పంచుకొంటాడు. ఈనెలలోనే ‘రాజాసాబ్’ కోసం ప్రభాస్ కొన్ని డేట్లు ఇచ్చాడు. కానీ ‘కల్కి’ ప్రమోషన్ల వల్ల సాధ్యం కాలేదు. ఈలోగా మారుతి ప్రభాస్ లేని కొన్ని సన్నివేశాలన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇటలీ నుంచి వచ్చాక.. ఇక పూర్తిగా ‘రాజాసాబ్’కే అంకితం అవుతాడని టాక్. ఆ తరవాత సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ పట్టాలెక్కుతుంది.