హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్దాక్షణ్యంగా వ్యవహరిస్తున్నారు. సెలబ్రెటీ అని కూడా చూడడం లేదు. రూల్స్ కి విరుద్ధంగా ఉంటే.. చలాన్లను రాసేస్తున్నారు. ఆమధ్య ఎన్టీఆర్, త్రివిక్రమ్, మంచు మనోజ్.. ఇలా చాలామంది కార్లని ఆపి, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు చలాన్లని రాసేశారు. ఈరోజు రోడ్ నెంబర్ 36లో ప్రభాస్ కారుని ఆపారని, మూడు చలాన్లని విధించారని వార్తలొచ్చాయి. ప్రభాస్ వాడుతున్న కారు నెంబర్ ప్లేటు సరిగా లేదని ఒకటి, ఎంపీ స్టిక్కర్ వాడుతున్నారని మరోటి, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తగిలించారని ఇంకోటి ఇలా.. రూ.1600 లకు చలానా రాశారని వార్తలొచ్చాయి. దీనిపై ప్రభాస్ పీఆర్ టీమ్ ఖండించింది. రోడ్ నెంబర్ 36లో ఆపి, పోలీసులు చలానా రాసిన కారుకీ ప్రభాస్ కీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచురించొద్దని మీడియాని కోరింది. సో.. ఈ కారుకీ, ప్రభాస్ కీ సంబంధం లేదని తేలిపోయింది. మరి ఆ కారు ఎవరిదో..?? ప్రభాస్ పేరు ఎందుకు బయటకు వచ్చిందో..?