ప్రభాస్ – మారుతి కాంబోలో రూపొందుతున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈమధ్య ప్రభాస్ అంతా ‘రా’, ‘యాక్షన్’ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రభాస్‌ని వింటేజ్ లుక్‌లో చూసే అవకాశం రాజాసాబ్ ద్వారానే వచ్చింది. అందుకే ఈ సినిమా వాళ్లకు అంత స్పెషల్.
ఈ క్రిస్మస్కి గానీ, జనవరి 1కి గానీ ‘రాజాసాబ్’ టీజర్ విడుదల చేద్దామనుకొంది చిత్రబృందం. టీజర్ కట్ కూడా జరిగింది. అయితే.. ఇప్పుడు ఈ ట్రీట్ వాయిదా పడింది. దానికి కారణం… రాజాసాబ్ విడుదలలో స్పష్టత లేకపోవడమే. ఏప్రిల్ 10న ‘రాజాసాబ్’ని విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఇప్పుడు అనుకొన్న సమయానికి రాజాసాబ్ రావడం కష్టంగా మారింది. మే నాటికి రావొచ్చు. మేలో వచ్చే సినిమాకు డిసెంబరులో టీజర్ ఎందుకు? అందుకే టీజర్‌ని ఇప్పుడు విడుదల చేయడం లేదు. ఈ మేరకు చిత్రబృందం కూడా ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఇప్పట్లో రాజాసాబ్ టీజర్‌ని వదిలేది లేదని స్పష్టం చేసింది. జనవరి 14న ఓ పాట అయితే రావొచ్చు.
రాజాసాబ్ టాకీ దాదాపుగా పూర్తయ్యింది. ఇప్పుడు 4 పాటలు తెరకెక్కించాల్సివుంది. జనవరిలో 2 పాటల్ని, ఫిబ్రవరిలో 2 పాటల్ని తెరకెక్కించాలన్నది ప్లాన్. జనవరి పాటల కోసం హైదరాబాద్ లోనే సెట్లు తయారు అవుతున్నాయి. ఫిబ్రవరి లో ఫారెన్ ట్రిప్ ఉంది. అక్కడ రెండు పాటల్ని పూర్తి చేసుకొని వస్తారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్పీడ్ డాన్సర్ లోని ఓ పాటని రీమిక్స్ చేద్దామనుకొంటున్నారు.