డిసెంబర్ 23… ఈ డేట్‌ని సలార్ కోసం లాక్ చేశారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబరు 28న రావాల్సిన సినిమా ఇది. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అయ్యింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ అదే రోజున షారుఖ్ సినిమా `డంకీ` రిలీజ్‌కి రెడీగా ఉంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. రాజ్ కుమార్ హిరాణీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పైగా ఇది షారుఖ్ సినిమా కూడా. వీరిద్దరి కాంబో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఎదురుచూస్తున్నారు. పైగా… పఠాన్, జవాన్.. ఇలా వరుసగా రెండు హిట్లతో షారుఖ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. తను ఈ యేడాది హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంతా గట్టిగా నమ్ముతున్నారు. ఈ దశలో… సలార్ కూడా అదే రోజున రావడంతో పోటీ తీవ్రతరమైంది.
ప్రభాస్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా సలార్ ఓ మాస్ సినిమా. సినిమా టాక్ ఎలా ఉన్నా, తొలి మూడు రోజుల్లో సౌత్ ఇండియా మొత్తం షేక్ చేసే వసూళ్లు సాధించే సత్తా.. సలార్‌కి ఉంది. సలార్ రావడం… షారుఖ్ సినిమాకి పెద్ద దెబ్బే. అయితే.. సలార్ కి షారుఖ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. నార్త్ లో సలార్‌కి అంతగా వసూళ్లు రాకపోవొచ్చు. అక్కడ.. షారుఖ్ సినిమాదే హవా. ఒకవేళ.. సోలోగా వచ్చి ఉంటే.. నార్త్ లో కూడా సలార్ ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ షారుఖ్ సినిమా ఉంది కాబట్టి.. సలార్ తగ్గక తప్పదు.
సలార్ లాంటి సినిమాని సోలో రిలీజ్ చాలా అవసరం. పైగా నార్త్ మార్కెట్ పై సలార్ చాలా ఆశలు పెట్టుకొంది. ఇలాంటి దశలో.. షారుఖ్ తో పోటీ పడడం రిస్కే. షారుఖ్ గత చిత్రాలకు సౌత్ నుంచి మంచి వసూళ్లు దక్కాయి. ఈసారి.. సలార్ వల్ల డంకీ ఆ అవకాశం కోల్పోతుంది. ఇలా ఎలా చూసినా ఒకే రోజు రావడం రెండు సినిమాలకూ రిస్కే! సోలోగా వస్తే ఈ టెన్షన్ ఉండేది కాదు.