సోషల్ మీడియాకు పెద్దగా టచ్లో ఉండని హీరో ప్రభాస్. ఎప్పుడో గానీ, ప్రభాస్ ట్విట్టర్, ఇన్స్టా ఖాతాలు యాక్టీవ్లోకి రావు. కానీ ఇప్పుడు ప్రభాస్ చేసిన ఓ పోస్ట్… అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ‘డార్లింగ్స్… ఓ స్పెషల్ పర్సన్ మన జీవితంలోకి రాబోతున్నారు… వెయిట్ చేయండి’ అంటూ ప్రభాస్ పెట్టిన ఇన్స్టా స్టోరీ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించే ఆ పోస్ట్ అంటూ, త్వరలోనే తన జీవిత భాగస్వామిని పరిచయం చేయబోతున్నాడంటూ అభిమానులు ఊహాల్లో ఊరేగుతున్నారు.
అయితే ఈ పోస్ట్ తన పెళ్లి గురించి కాదు. ‘కల్కి’ సినిమా గురించి. ఈ సినిమాలోని హీరోయిన్ గా దీపికా పదుకొణె నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు సంబంధించిన ఇంట్రో ఇవ్వడానికి చిత్రబృందం రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో దీపికకు సంబంధించిన ఓ టీజర్ విడుదల చేయబోతున్నారు. అందుకోసమే ప్రభాస్ ఈ సందేశం పంపాడు. ఇప్పటి వరకూ ప్రభాస్, అమితాబ్ పాత్రల్ని రివీల్ చేశారు. ఇప్పుడు దీపికాది రాబోతోంది. త్వరలోనే కమల్ హాసన్ పాత్రని కూడా పరిచయం చేయాలన్న ఆలోచనల్లో ఉంది చిత్రబృందం. జూన్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.