రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభాస్ ఇక్కడకు చేరుకున్నారు. తమ అభిమాన హీరో ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు ‘రెబల్‌స్టార్.. రెబల్‌స్టార్’ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
మధ్యాహ్నం జరగనున్న కార్యక్రమంలో సుమారు లక్షమంది అభిమానుల కోసం ప్రభాస్ టీమ్ భోజన ఏర్పాట్లు చేసింది. అలాగే అభిమానులని ఉద్దేశంచి మాట్లాడటానికి కూడా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడారు. “ఐ లవ్ యూ.. పెదనాన్న మన గుండెల్లో వున్నారు” అని అభిమానులకు అభివాదం చేశారు ప్రభాస్.