బాహుబలి ప్రభావం ప్రభాస్పైచాలా ఏళ్లు ఉండి తీరుతుంది. ఎందుకంటే ఆ సినిమా సంపాదించి పెట్టిన ఖ్యాతి అంతటిది. బాహుబలి టెక్నీషియన్లతోనూ ప్రభాస్ అనుబంధం ప్రత్యేకం. ఎందుకంటే దాదాపు 4 యేళ్లు వాళ్లతో కలసి ట్రావెల్ చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. అందుకే.. వాళ్లతో తన అనుబంధం కొనసాగించాలనుకొంటున్నాడు ప్రభాస్. బాహుబలి 2 తరవాత సుజిత్ సినిమాకి ఓకే చెప్పాడు ప్రభాస్. అది యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కేచిత్రం. అంటే ప్రభాస్ సొంత సంస్థే అన్నమాట. తనకిష్టమైన టెక్నీషియన్లను ప్రభాస్ అడిగి తీసుకొనే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ప్రభాస్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొందామనుకొంటున్నాడట. బాహుబలికి పనిచేసిన టెక్నీషన్లనే దాదాపుగా ఈ సినిమాకీ రిపీట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బాహుబలికి పనిచేస్తున్న సెంథిల్, సాబూ సిరిల్, పీటర్ హెయిన్స్… ఇలా కీలకమైన టెక్నీషియన్లను సుజిత్ సినిమాకి ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తోంది. వాళ్ల రాకతో.. తన సినిమాకి మరింత హైప్ వస్తుందని ప్రభాస్ భావిస్తున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది సుజిత్ ఇష్టానికి వదిలేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి బాహుబలి తరవాత కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి ప్రభాస్ ఆసక్తి కనబరుస్తున్నాడన్న విషయం అర్థమైంది. రిజల్ట్ కూడా అదే స్థాయిలో ఉంటే అంతకంటే ఏం కావాలి??