ప్రభాస్ కొత్త సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు ‘సాహో’ షూటింగ్ జరుగుతుండడంతో… ఇది పూర్తయ్యాకే కొత్త సినిమా పట్టాలెక్కుతుందనుకున్నారు. అయితే… ఈ సినిమా కోసం ‘సాహో’కే బ్రేక్ ఇచ్చేస్తున్నార్ట. ఈనెల 20 నుంచి ఇటలీలో రాధాకృష్ణ సినిమా మొదలవుతుంది. పూజా హెగ్డే తదితరులపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారు. 24 నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో పాలు పంచుకుంటున్నాడట. రాధాకృష్ణ సినిమా ఓ షెడ్యూల్ అయ్యాకే.. ‘సాహో’ తిరిగి మొదలవుతుందని సమాచారం. 2019 వేసవిలో సాహో విడుదలయ్యే అకాశాలున్నాయి. 2019లోనే రాధాకృష్ణ సినిమానీ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే `సాహో` అవ్వక ముందే… ఈ సినిమా షూటింగ్నీ మొదలెట్టేస్తున్నారు.