ఈమధ్య ప్రభాస్‌కి రకరకాల కారణాల వల్ల ఆపరేషన్లు అవసరం అవుతున్నాయి. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు ప్రభాస్. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సాగుతోంది.అందులో భాగంగా ఓ కీలకమైన ఆపరేషన్ ఇప్పుడు జరగబోతోంది. ప్రభాస్ ఈమధ్య బాగా లావుగా మారి.. సన్నబడ్డాడు. `సీతారామం` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కొత్త అవతారంలో కనిపించాడు. ప్రభాస్ లుక్ చూసి.. అభిమానులు ఫిదా అయిపోయారు. ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా మారగలిగాడు ప్రభాస్. ఈ మార్పుకి కారణం… ఆక్వా థెరపీ అని తెలిసింది. ఆక్వా థెరపీ ద్వారా చాలా సహజమైన పద్ధతిలో ప్రభాస్ బరువు తగ్గాడు. మోకాలి ఆపరేషన్ ముందు బరువు తగ్గడం అవసరమని వైద్యులు సూచించడంతో ప్రభాస్ ఆక్వా థెరపీ ఫాలో అయ్యాడు. ఈ పద్దతిలో బరువు చాలా త్వరగా తగ్గుతారు. పైగా.. సహజమైన ప్రక్రియని పాటించినట్టు అవుతుంది. ఇప్పుడు బరువు తగ్గాడు కాబట్టి.. ఆపరేషన్‌కి రెడీ అయినట్టే. త్వరలోనే ప్రభాస్‌కి చిన్నపాటి ఆపరేషన్ జరగబోతోంది. ఆ తరవాత రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకొని `ప్రాజెక్ట్ కె`, `సలార్` షూటింగుల్లో పాల్గొనబోతున్నాడని టాక్.