ప్రభాస్ కథానాయకుడిగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కథానాయకుడిగా ప్రభాస్‌కు ఇది 20వ సినిమా. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. ఇటలీలో శనివారం చిత్రీకరణ మొదలైంది. ఫస్ట్ డే హీరోయిన్ చేతిలో హిందీ స్క్రిప్ట్ పెట్టారు. అదేంటి? సినిమాను తెలుగులో తీయడం లేదా? అనే సందేహాలు పెట్టుకోకండి. దర్శకుడు రాధాకృష్ణ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డేకు తెలుగు అంత స్పష్టంగా రాదు కదా! అందుకని, హిందీ వెర్షన్ స్క్రిప్ట్ ఆమె చేతిలో పెట్టినట్టు వున్నారు. ‘బాహుబలి’ విజయాల తరవాత ప్రభాస్‌కు దేశ, విదేశాల్లో అభిమానులు పెరిగారు. వాళ్ళందర్నీ దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ సినిమాను గానీ.. ఈ సినిమాను గానీ తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్20 ప్రత్యేకత ఏంటంటే… చాలా రోజుల తరవాత పెదనాన్న కృష్ణంరాజు నిర్మాణ సంస్థ గోపికృష్ణ మూవీస్‌లో ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ‘సాహో’ బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేయడానికి ప్రభాస్ ప్లాన్ చేస్తున్నార్ట!!