ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ సౌత్ సినిమాలను కాకుండా కొద్దికాలంగా బాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఎం.ఎల్.విజయ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్న ప్రభుదేవ చాలా కాలం తర్వాత తెలుగు తమిళ భాషల్లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇందులో యూత్ ఫుల్ హీరో కార్తి నటించబోతున్నాడని సమాచారం.
ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో కింగ్ నాగార్జునతో కలిసి ఊపిరిగా రాబోతున్న కార్తి ఓ వైపు మణిరత్నం సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రభుదేవ దర్శకత్వంలో చేసే ద్విభాషా చిత్రంలో కూడా కార్తినే సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న కార్తి కరెక్ట్ సినిమా తీస్తే ఇక్కడ సూపర్ హిట్ సాధించడం గ్యారెంటీ.. తను నటించిన అవారా, నా పేరు శివ తెలుగులో మంచి విజయాలు దక్కించుకోవడం జరిగింది.
ఇక ఊపిరి ఈ నెల 25న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ కు ముందే నాగార్జున సినిమా మీద ఉన్న నమ్మకంతో హిట్ గ్యారెంటీ అనేస్తున్నారు. మరి వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ మీదున్న కార్తి చేస్తున్న సినిమాలన్ని ఘన విజయం సాధిచాలని ఆశిద్దాం.