హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం అర్థరాత్రి మిన్నంటాయి. రోడ్లపై మందు బాబులు తాగి హల్ చల్ చేస్తారని ముందే పసిగట్టిన పోలీసు శాఖ అప్రమత్తమైంది. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌ని నిర్వహించింది. వందలమంది మందు బాబులు అడ్డంగా దొరికిపోయారు. అందులో టీవీ యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నాడు. బంజారా హిల్స్ రోడ్ నెం.45లో బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించారు. ఆ దారి వెంట వెళ్తున్న ప్రదీప్నీ పోలీసులు చెక్ చేశారు. ఆ సమయంలో మోతాదుకి మించి మద్యం సేవించిన ప్రదీప్ పోలీసులకు దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్ టోస్టులో 174 పాయింట్లు వచ్చాయట. సాధారణంగా 30 పాయింట్లు మించితే… కేసు నమోదు చేస్తారు. దాదాపు ఆరు రెట్లు ఎక్కువన్నమాట. వెంటనే ప్రదీప్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ప్రదీప్ మరో వాహనంలో… తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈరోజు.. ప్రదీప్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈమధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పట్ల.. న్యాయస్థానం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. వారం నుంచి 15 రోజుల వరకూ జైలు శిక్ష కూడా విధిస్తోంది. మరి ప్రదీప్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.