తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.. ప్రగతి నివేదన సభకు.. పాతిక లక్షల మంది కంటే.. ఎక్కువే వచ్చారని బయటకు చెప్పుకోవచ్చు గాక..! సభ సూపర్ సక్సెస్ అయిందని… మంత్రి కేటీఆర్‌కు ప్రశంసల వర్షం కురిపించి సన్మానం చేయవచ్చు గాక..!..కానీ అసలు విషయం మాత్రం.. “ప్చ్..” . ఈ విషయాన్ని మీడియా చెప్పదు. సోషల్ మీడియాలో వచ్చిన నిఖార్సైన స్పందనలే తెలిజేస్తాయి. అవునన్నా.. కాదన్నా.. ఈ ఇంపాక్ట్ ప్రజలపై ఉంటుంది. మరి ఇది.. మంత్రి కేటీఆర్‌కు మైనస్‌గా మారుతుందా..? ఆయన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందికరంగా ఉంటుందా..?
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బయటకు కనిపించని ఓ రేస్ నడుస్తోంది. కేటీఆర్‌ను ఈ రేసులో చాంపియన్‌గా నిలబెట్టాలని కేసీఆరే సర్వ విధానాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా.. కేటీఆర్‌కు… అటు పార్టీలో… ఇటు ప్రజల్లో కూడా.. యాక్సెప్టెన్సీ తీసుకు వచ్చేందుకు కేసీఆర్ చాలా రోజులుగా వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే.. కేసీఆర్ షాడో సీఎంలా వ్యవహరించడానికి చాన్సిచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో హాజరవ్వాల్సిన కీలక సమావేశాలకూ.. కేటీఆర్‌నే పంపుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ కేటీఆరే. సరే ఎంతలా సీఎం బాధ్యతలన్నీ నిర్వర్తించినా.. ఆయనను ప్రజలు నేరుగా సీఎంగా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం లేదు. రాజకీయాది వేరే సైన్స్. దాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. కేసీఆర్‌కు ఇది బాగా తెలుసు.
ప్రజల్లో ముందుగా కేటీఆర్‌కు యాక్సెప్టెన్సీ రావాలంటే.. పార్టీలో ముందు తన కన్నా పోటుగాడు లేడని నిరూపించుకోగలగాలి. ఎవరూ లేకపోతే.. కేటీఆర్‌కు .. ఇది పెద్ద సవాల్ అయ్యేది కాదు. కానీ ఎదురుగా .. శిఖరంగా హరీష్ రావు ఉన్నారు. మామతో కలిసి టీఆర్ఎస్ ప్రస్థానంతో తీసి వేయలేని స్థానాన్ని సంపాదించుకున్న కేటీఆర్… సభలు, సమావేశాలు, ఎన్నికలు, ఉపఎన్నికలు అనే తేడా లేదు.. ఏ బాధ్యత అప్పగించినా.. “సారీ మామా..” చేయలేకపోయాను..అనే మాట అనే పరిస్థితి తెచ్చుకోలేదు. కేసీఆర్ కూడా చాలా సార్లు ” హరీష్ పక్కనున్నంత కాలం.. నాకు చింతే లేదు” అని… చెప్పుకున్నారు. అలాంటి క్యారెక్టర్‌ను కాదని.. ఇప్పుడు… తన కొడుకును ఆ స్థానంలోకి తేవాలంటే.. హరీష్ రావు కంటే సమర్థుడని.. కనీసం చూపించుకోగలగాలి. అందుకే ఇంత కాలం.. షాడో సీఎం పోస్ట్ ఇవ్వడమే కాదు.. ప్రగతి నివేదన సభ బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ అక్కడే తేడా కొట్టింది…!
ఈ సభ ఆలోచనలో కానీ.. ఏర్పాట్లలో కానీ.. జన సమీకరణలో కానీ.. హరీష్ ఎక్కడా చేయిచేసుకోలేదు. తన నియోజకవర్గం నుంచి 25వేల మందిని తరలించి తన సత్తా మటుకు చాటుకున్నారు. ప్రగతి నినేదన సభపై ప్రజల్లో వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసిన తర్వాత.. ఈ సభ వల్ల కేటీఆర్ కంటే హరీష్‌కే ఎక్కువ మేలు జరిగింది. ఎందుకంటే ..అదే ఈ సభ నిర్వహణ హరీష్ రావుకు అప్పగించి ఉంటేనా..? అన్న పీలింగ్ టీఆర్ఎస్ శ్రేణుల్లో వస్తోంది. కేటీఆర్‌కు ఇదే పెద్ద మైనస్. ఇది రాజకీయ జీవితం మొత్తం వెంటాడే అవకాశం ఉంది.