ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంతో.. వచ్చే సారి కలెక్టర్ల సమావేశం కానీ.. ఇతర అత్యున్నత స్థాయి సమావేశాలు కానీ ఎక్కడ జరుగుతాయన్న సందేహం సహజంగానే వస్తుంది. విజయవాడలోని స్టార్ హోటళ్లలో పెట్టాలంటే… రూ.కోట్లు ఖర్చవుతాయి. అవి భరించలేకే…ప్రజావేదిక నిర్మించారు. ఇప్పుడా వేదికను కూడా కూలగొడుతున్నారు కాబట్టి.. మళ్లీ స్టార్ హోటళ్లకు వెళ్లాల్సిందేనా.. అన్న అనుమానం అధికారవర్గాలకు వచ్చింది.కానీ..ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ప్రజావేదిక లాంటి ఓ నిర్మాణాన్ని మరో చోట కట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. బుధవారం ఉదయం నుంచే ప్రజావేదికను కూలగొట్టబోతున్నారు.
కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాత ప్రజావేదిక నుంచి… ఫర్నీచర్ సహా.. ఏసీలు, ఇతర సామాగ్రి మొత్తాన్ని తరలించబోతున్నారు. పనికి వచ్చే ప్రతి వస్తువును… తీసుకెళ్తారు. తర్వాత దాన్ని కూలగొడతారు. అలా తీసుకెళ్లిన వస్తువులన్నింటినీ… త్వరలో నిర్మించబోయే.. మరో ప్రజావేదిక తరహా.. భవనానికి ఉపయోగిస్తారు. ఇప్పటికే.. అధికారులకు స్థలం సిద్దం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రికి.. ఇలాంటి ఓ భవనం ఉంటేనే విధుల నిర్వహణ సులభం అవుతుంది. చంద్రబాబు… దాదాపుగా ప్రతీ రోజూ.. ప్రజావేదికలో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇంటి పక్కనే ఉంది కాబట్టి.. పార్టీ కార్యక్రమాలను కూడా అక్కడ్నుంచే నిర్వహించేవారు.
అలా.. బహుళ ఉపయోగం ఉండేలా… మరో ప్రజావేదికను.. నిర్మించనున్నారు. దీనికి రూ. పది కోట్ల వరకూ ఖర్చవుతుందని.. అధికారవర్గాలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా.. ఎక్కడ నిర్మించాలి.. ఎలా నిర్మించాలన్నదానిపై క్లారిటీ లేదు. మొత్తం ఖరారైన తర్వాత ఖర్చు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.