తెలగాణం అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న ప్రజాకూటమి.. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి ఉంటుందా .. ఊడుతుందా.. అని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో.. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి క్లారిటీ ఇస్తున్నాయి. నిన్న ఓ హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ప్రజాకూటమి ఉంటుందని ప్రకటించారు. తెలంాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గా ఉన్న కుంతియా… హైకమాండ్ నుంచి వచ్చిన సందేశం మేరకు … అలా మాట్లాడి ఉంటారని చెబుతున్నారు. అదే సమయంలో.. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కూడా అదే విధంగా స్పందించారు. కూటమి ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల్లో వైఫల్యంపై.. మీడియాతో తన మనసులోని మాటలను చిట్ చాట్ లో కోదండరాం.. బయటపెట్టారు. కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమన్నవాదన సరైంది కాదని కోదండరామ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈవీఎంలే తమ ను ఓడించాలని చెబుతున్నారు. ఈ వాదనను.. కోదండరాం తోసిపుచ్చారు.
ప్రజాకూటమి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని .. ప్రచారానికి ఎక్కువ సమయం లేకుండా చేశారన్నారు. ప్రచారానికి కనీసం 50 రోజులు కావాలని చెప్పానని.. 3 వారాలు చాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు అన్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదిహేను రోజులు సరిపోతుందన్నారని.. గుర్తు చేసుకున్నారు. తాను నేను లోక్‌సభకు పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని… కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తానన్న వార్తలు కూడా అవాస్తవమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్‌ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఎవరి కోసమో కేసీఆర్‌కే తెలియాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తే చంద్రబాబుకే లాభమని విశ్లేషించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. కూటమిగా వెళ్లడానికే… పార్టీలు ఇష్టపడుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికన జరుగుతాయి కాబట్టి.. ఈ విషయంలో సెంటిమెంట్ వర్కవుట్ అవదనే భావనకు… కూటమి నేతలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. టీడీపీ నేతలు మాత్రం ఇంకా కూటమిపై అధికారికంగా స్పందించలేదు. ఏపీలో పరిస్థితులను బట్టి చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.