అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి తక్కువ తనానికి బ్రాండ్ అంబాసిడర్ గా .. కలెక్టర్ల సమావేశం ఆ ప్రజావేదికలోనే పెట్టి.. అందులోనే సమావేశం అయిపోగానే కూల్చేస్తామని నిర్ణయం ప్రకటించారు. అది పది కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ప్రభుత్వ ఆస్తి.
ఆ విధ్వంస శకరాలను కూడా ఐదేళ్ల పాటు తీసేయలేదు. చంద్రబాబుకు మానసిక వేదన ఉండాలని వాటిని అలాగే ఉంచేశారు.అయితే ఆ శకలాలను చూసి చంద్రబాబు మనసు విరిగిపోలేదు. మరింత పట్టుదల పెంచుకున్నారు., ఇప్పుడు సీఎం అయినా దాన్ని అాలాగే ఉంచాలని డిసైడయ్యారు. ఎందుకంటే భవిష్యత్ లో ఎవరికైనా మళ్లీ వైసీపీకీ ఓటేయాలనిపిస్తే దాన్నే చూపించాలనుకుంటున్నారు., ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రజావేదిక శకలాలను అలాగే ఉంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డికే మానసిక వేదన కల్పించనుంది. తాను అధికార మత్తులో చేసిన తప్పులు తనను రాజకీయంగా ఇలా వెంటాడతాయని ఆయన ఊహించి ఉండరు. ఇప్పుడు ఆ కూల్చివేతకు ఆయన సమాధానం చెప్పుకోలేరు. ఎందుకంటే అది అక్రమ కట్టడం అని చెప్పి కూల్చివేశారు.. కానీ ఒక్క సాక్ష్యం కూడా అది అక్రమ కట్టడం అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది.