సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విషయంలో పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఓ ట్వీట్‌ను గెలుక్కుని విదేశాల్లో ఉన్న 30వ తేదీన తిరిగొస్తా అప్పుడు మాట్లాడుకుదాం అని సవాల్ చేసిన ప్రకాష్ రాజ్.. తాజాగా ఎవరి పని వారు చేసుకుందాం అని ట్వీట్ పెట్టారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణలో ఉంటాను.. తాను సమాజ రక్షణలో ఉంటానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ అందరూ చెప్పింది అదే. అందరూ ఎవరి పని వారు చేసుకోవాలని.. ఒకరు వ్యవహారంలో ఒకరు వేలు పెట్టకూడదని.
https://x.com/prakashraaj/status/1842129810241311158
ప్రకాష్ రాజ్ జస్ట్ అస్కింగ్ .. అనేది వివక్ష లేకుండా ఉండాలి. కానీ ఆయన పబ్లిసిటీ కోసం కొంత మందిని విమర్శిస్తున్నట్లుగా ఉంటుంది. ఎవరైనా విమర్శించడానికి ఆయన కొలమానమేంటో ఆయనకు అర్థం కాదు. ఎవరిని పడితే వాళ్లను విమర్శించడానికి రెడీ అయిపోతారు. ప్రకాష్ రాజ్ కు ఉన్నట్లే పవన్ కూ అభిప్రాయాలు ఉంటాయి. వాటిలో వైరుధ్యత ఉంటే… సరైన వేదిక నుంచి ప్రశ్నించాలి. కానీ ఓ ట్వీట్ చేసి ఇతర రాజకీయ పార్టీలకు మేలు చేసేలా వ్యవహరించకూడదు. ఇక్కడ అదే జరిగింది.
చివరికి ప్రకాష్ రాజ్ తెలిసి వచ్చిందేమో కానీ.. ఎవరి పని వాళ్లు చేసుకుందామని ట్వీట్ చేశారు. దాంతో పవన్ తో పెట్టుకునేందుకు ప్రకాష్ రాజ్ వెనుకడుగు వేశారని అనుకోవచ్చు. ఇలాంటి విషయాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడుకునేందుకు పూర్తి స్థాయిలో ఓ వేదికను ఎంపిక చేసుకుని .. ఎదుటి వారిపై రాళ్లేస్తే బాగుంటుంది కానీ.. గౌరవిస్తున్న వారిపై ఊరకనే విమర్శలు చేయడం విజ్ఞుల లక్షణం అనిపించుకోదు. పవన్ విషయంలో ప్రకాష్ ఇప్పటికే దారి తప్పినట్లుగా గుర్తించారని అనుకోవచ్చు.