హా….. హా.. హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది జెనీలియా. తర్వాత రితిష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. భర్తతో కలసి ముంబాయ్ లో వుంటుంది. అయితే ఇన్నాళ్ళకు ఆమె మళ్ళీ తెలుగు గడ్డపై ఆడుగుపెట్టింది. అదీ ‘మా’ ఎన్నికల నేపధ్యంలో. తన ఓటు వేయడానికి ముంబాయ్ నుంచి వచ్చింది జెనీలియా. ఓటు వేసేందుకు రావడం సంతోషంగా ఉందని, అతి త్వరలో సూపర్ ప్రెసిడెంట్ రాబోతున్నారని చెప్పుకొచ్చింది జెనీలియా.
ఈ ఎన్నికల్లో జెనీలియా పేరు కూడా వినిపించింది. ఆమె ఓ ఓటుపై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘మా’ లో చాలా మంది వున్న ఓటర్లు అంతా యాక్టివ్ ఓటర్లు కారు. ఉదాహరణ జెనీలియా ముఖ్యమంత్రి కొడుకుని పెళ్లి చేసుకొని ముంబాయి వెళ్ళిపోయింది. ఆమె మా లో ఇన్ యాక్టివ్ గా వుంది. ఇలానే చాలా మంది వున్నారు” అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ చర్చనీయంశమైయింది. దీంతో పోలింగ్ రోజు జెనీలియా రావాడం సహజంగానే అందరిద్రుష్టిని ఆకర్షించింది. విష్ణుతో కలసి ఫోటోకి ఓ ఫోజ్ కూడా ఇచ్చింది. విష్ణు- జెనీలియా కలసి ‘ఢీ’ సినిమా చేశారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం వుంది. మా ఎన్నికల్లో ఒక ప్యానల్ కొంతమంది సభ్యుల కోసం ఫ్లైట్ టిక్కెట్లు కూడా బుక్ చేశారని వార్తలు వచ్చాయి. జెనీలియా రాక వెనుక ఏ ప్యానల్ వుందో ఇక ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.