డూ ఆర్ డై పరిస్థితుల్లో కృష్ణవంశీ తీసిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమా అనుకొన్నప్పటి నుంచీ కష్టాలే. అనుకొన్న బడ్జెట్లో, అనుకొన్న సమయానికి సినిమా పూర్తి కాలేదు. నిర్మాతలు మారారు. రిలీజ్ డేట్ కోసం ఎదురు చూడాల్సివచ్చింది. మధ్యలో ప్రకాష్ రాజ్కీ, కృష్ణవంశీకీ మధ్య లుకలుకలు వచ్చాయి. వాటిని దాటుకొని ఈ సినిమా పూర్తి చేశాడు కృష్ణవంశీ. ఉగాది రోజున సినిమా విడుదల కాబోతోంది. కృష్ణవంశీ చాలా ప్రేమించి తీసిన సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ప్రెస్ మీట్లూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లూ లేకుండానే ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ తీసుకుని రావడానికి ప్రివ్యూలు ప్లాన్ చేశాడు. దానికి మంచి స్పందన వచ్చింది. సినిమా చూసినవాళ్లంతా అద్బుతంగా ఉందని మెచ్చుకొంటున్నారు. కానీ.. ప్రివ్యూలు మినహా ప్రమోషన్ యాక్టివిటీస్ లేవు. దానికి కారణం.. ప్రకాష్రాజ్కీ, కృష్ణవంశీకి మద్య గ్యాప్ ఇంకా సెట్ కాకపోవడమే. ఈ సినిమా ప్రమోషన్లకు రానని ప్రకాష్ రాజ్ చెప్పేశాడట. ప్రకాష్ రాజ్ లేకుండా ప్రమోషన్లు ఎలా చేస్తారు? అందుకే కృష్ణవంశీ దాని జోలికి వెళ్లకుండా కేవలం ప్రివ్యూలతోనే సరిపెట్టాడు.
ప్రకాష్ రాజ్కీ కృష్ణవంశీకి మద్య గ్యాప్ రావడం ఇదే తొలిసారి కాదు. గోవిందుడు అందరివాడేలేకి ముందు ఇదే జరిగింది. కానీ చిరంజీవి కోసం ఆ సినిమాకి కలిసి పనిచేశారు. ఇప్పుడు రంగమార్తండ తీశారు. రంమార్తండ సగం సినిమా పూర్తయ్యేంత వరకూ ఇద్దరి మధ్యా స్నేహం బాగానే ఉండేది. కానీ, ఆ సినిమా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చాయని టాక్. అందుకే ప్రకాష్ రాజ్ ఈ సినిమాని పట్టిచుకోవడం లేదని తెలుస్తోంది.