తెరపై విలనిజం పండించినా.. ప్రకాష్ రాజ్ రియల్ లైఫ్‌లో మాత్రం హీరోనే. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ ఊరి బాబోగులు చూస్తుంటారు. అవసరమైనప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మరోసారి తన హీరోయిజం చూపించారు. కరోనా వైరస్ ప్రభావంతో షూటింగులన్నీ బంద్ అయ్యాయి. ఈనెల 31 వరకూ దేశమంతా కర్ఫ్యూ వాతావరణమే. అందుకే ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు.
తన దగ్గర పని చేసే ఉద్యోగులందరికీ ఓ నెల జీతం బోనస్‌గా ప్రకటించారు. తన నిర్మాణ సంస్థలో ఇప్పుడు మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. షూటింగులు ఆగిపోవడం వల్ల… నెలసరి వేతనాలపై పనిచేసే కార్మికులు ఖాళీగా ఉండాల్సివస్తోంది. వాళ్లకుసైతం సగం జీతం అడ్వాన్స్‌గా ఇవ్వాలనుకుంటున్నాడట. ఇది నా వంతుగా నేను నెరవేరుస్తున్న బాధ్యత… అంటూ ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని పంపాడు ప్రకాష్‌రాజ్. తన ప్రయత్నం మిగిలినవాళ్లందరికీ ఆదర్శం కదా?