‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రకాష్ రాజ్ సంచలనమైన కామెంట్స్ చేశారు. అదో చెత్త చిత్రం అని వ్యాఖ్యానించారు. ‘’ఈ చిత్రాన్ని తీయడమే సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఉమ్మేసింది. అయినప్పటికీ, ఆ సినిమా డైరెక్టర్ మాత్రం ఆస్కార్ తనకేందుకు రావడం లేదంటున్నారు. ఆయనకు ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదు’’ అన్నారు ప్రకాష్ రాజ్. ఇదే సమయంలో పఠాన్ సినిమా పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, బాలీవుడ్ బాయ్ కాట్ అన్నవారికి పఠాన్ 700 కోట్లు వసూలు రాబట్టి చూపించింది. వాళ్లకు తెలిసింది కేవలం మొరగడమే. వారితో ఏం కాదు. ప్రతిసారి కూడా ప్రజలను ఫూల్ చేయలేరు’ అన్నారు.
కాగా గతంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ జ్యూరీ హెడ్, ఇజ్రాయెలీ ఫిల్మ్ మేకర్ నదవ్ లపిడ్ చేసిన కామెంట్లపై దుమారం రేపాయి. అయితే ఆ వివాదంతో ఇండియాకు ఇజ్రాయెల్ సారీ కూడా చెప్పింది. నదవ్ లపిడ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ చెత్త సినిమా అని కామెంట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ఇజ్రాయెల్ రాయబారి నదవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. కేంద్రానికి బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పారు. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కాశ్మీర్ ఫైల్స్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రకాష్ రాజ్ కామెంట్స్ జాతిని చరిత్రని కించేపరిచే విధంగా వున్నాయని, ఈ విషయంలో ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ స్పందన ఎలా వుంటుందో చూడాలి.