కృష్ణవంశీ సినిమాల్లో ప్రకాష్‌రాజ్‌కి మంచి పాత్రలు పడ్డాయి. అంతఃపురం అయితే.. ప్రకాష్‌రాజ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఖడ్గంలోనూ హీరోలకు సమాన స్థాయి పాత్ర కల్పించాడు. కొన్నాళ్లు వీళ్ల ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే మధ్యలో కొన్ని విబేధాలు వచ్చాయి. `గోవిందుడు అందరివాడేలే`తో మళ్లీ కలిసిపోయారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్టు సమాచారం. ఈసారి ప్రకాష్ రాజే.. కృష్ణవంశీ హీరో. మరాఠీలో నానా పటేకర్ నటించిన ‘నట సామ్రాట్’ అనే చిత్రాన్ని రీమేక్ చేయాలని కృష్ణవంశీ భావిస్తున్నాడని సమాచారం. నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ప్రకాష్‌రాజే నిర్మాతగానూ వ్యవహరిస్తాడని తెలుస్తోంది. `రుద్రాక్ష` అనే ప్రాజెక్టు కూడా పరిశీలనలో ఉంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. కాకపోతే.. దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది. `నట సామ్రాట్` అయితే.. తక్కువ బడ్జెట్లో పూర్తి చేయొచ్చు. అందుకే కృష్ణవంశీ ప్రకాష్‌రాజ్ సినిమాకే తొలి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.