టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులున్నా కొందతమంది పేర్లు అలా చరిత్రలో మిగిలిపోతాయి. వారి సినిమాలు ఎన్ని అవార్డులొచ్చాయి ఎన్ని రివార్డులు పొందింది కాదు ఎంతమంది ప్రేక్షకులకు చేరువయ్యింది అన్నది చూస్తారు. తెలుగు సినిమా పరిశ్రమలో సృజనాత్మక సినిమాలు తీస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణవంశీ.
కొంతకాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడం మానేశాయి.. అయినా సరే ఛాన్స్ వస్తే తానేంటో నిరూపించుకోవాలనే తపన పడుతున్నాడు కృష్ణవంశీ. అయితే అలాంటి ఛాన్స్ తానిస్తా అంటున్నాడు ప్రకాశ్ రాజ్. ఓ వైపు నటుడిగా ఉంటూనే దర్శకత్వం చేస్తూ సినిమాలను నిర్మించడం ప్రకాశ్ రాజ్ పాలసి. ఇక ఏ భాషలో అయినా సరే తనకు నచ్చిన సినిమా కనబడితే దాన్ని తెలుగు తమిళ ప్రేక్షకుల కోసం తీసుకువస్తాడు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ మనసు గెలుచుకున్న మరాఠి సినిమా నటసామ్రాట్.. మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నానా పటేకర్ లీడ్ రోల్ లో నటించారు.
అయితే ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రీమేక్ చేసే ఆలోచనల్లో ఉన్నాడు ప్రకాశ్ రాజ్. దీనికి దర్శకుడిగా కృష్ణవంశీని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణవంశీ డైరక్షన్ లోనే ప్రకాశ్ రాజ్ డిఫరెంట్ పాత్రలు చేయడం జరిగింది. అంతేకాదు ఇద్దరు మంచి స్నేహితులు కూడా. అందుకే ఫ్లాప్స్ లో ఉన్న కృష్ణవంశీ చేతిలో ఈ సినిమా పెట్టేశాడట ప్రకాశ్ రాజ్.మరి కృష్ణవంశీ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో చూడాలి. మొన్నటిదాకా రుద్రాక్ష సినిమా అంటూ హడావిడి చేసిన కృష్ణవంశీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి సందీప్ కిషన్ తో తీసే సినిమా గురించి కథా చర్చల్లో ఉన్నాడట. సందీప్ తో సినిమా ముగిసిన వెంటనే నటసామ్రాట్ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.