లడ్డూ వివాదంలో నిండా మునిగిపోయిన వైసీపీ.. కూటమి నేతలకు ముఖ్యంగా కల్ట్ హిందూత్వాన్ని చూపిస్తున్న పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చే సరుకు ఉన్న లీడర్లు ఎవరూ తమకు కనిపించడం లేదు. దీంతో తమ వాదన ఎక్కడా వినిపించడం లేదని అనుకుంటున్న వారికి ప్రకాష్ రాజ్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఆయనను వీలైనంత త్వరగా రంగంలోకి దింపేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని వ్యక్తం చేసిన అభిప్రాయంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. లడ్డూ కల్తీని జాతీయ సమస్యగా చేయవద్దని..నిందితుల్ని శిక్షించాలన్నాడు. ఈ వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసి ఘాటుగా స్పందించారు. నేపాల్ షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్.. తాను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదని.. నెలాఖరులో వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతానని వీడియో రిలీజ్ చేశారు.
వెంటనే అంబటి రాంబాబు తెరపైకి వచ్చారు. అసలు ప్రకాష్ రాజ్ ఏం తప్పు మాట్లాడారని పవన్ రెచ్చిపోయారని ఆయనను వెనకేసుకొచ్చారు. ప్రకాష్ రాజ్ వాయిస్ అయితే.. పవన్ కల్యాణ్ విషయంలో గట్టిగా వినిపిస్తుందని వైసీపీ ఆశ పడుతుందని అంబటి రాంబాబు ఉత్సాహంతోనే తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ను వైసీపీ నేతలు.. సంప్రదించారని.. ఆయనకు సన్నిహితులైన ద్వారా.. పవన్ తో రచ్చ చేయించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ వచ్చేటప్పటికి పరిస్థితి చేయి దాటిపోతుందని.. అప్పుడు వచ్చినా ప్రయోజనం ఉండనది వైసీపీ వ్యూహకర్తలు కంగారులో ఉన్నారు.
ప్రకాష్ రాజ్‌కు ..మెగా కాంపౌండ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన మా అధ్యక్షుడిగా నిలబడినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా సపోర్టు చేశారు. ఇప్పుడు తనకు మాలిన రాజకీయంలో పవన్ ను ఎందుకు గెలుక్కుంటున్నారన్నది కూడా ఆసక్తికరమే.