‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రకాష్ రాజ్. ఈ మేరకు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టకరమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని , ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు ప్రకాష్ రాజ్. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు
ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని, నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారని, ‘మా’తో నాకు 21ఏళ్ల అనుబంధం వుందని, నాకు ఓట్లు వేసిన అందరికీ కృతజ్ఞతలని, ఇతర రాష్ట్రాలవారు తెలుగు సినిమాల్లో నటించొద్దన్న నిబంధనలు ఏమీ లేవని అందుకే తెలుగు సినిమాల్లో యథావిధిగా నటిస్తానని, నేను యూనివర్సల్ పర్సన్నని, అయితే ప్రాంతీయ అజెండా వున్న అసోసియేషన్ లో నేను వుండలేనని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.
ఓడిపోయినందుకు రాజీనామా చేయలేదని, నాకంటూ ఒక ఆత్మగౌరవం వుందని, ఇలాంటి ఐడియాలజీ వున్న సంఘంతో కలసి పనిచేయలేక రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అయితే తాను బయట నుంచి పనిచేస్తానని, ఇది ఇక్కడితో ఆగిపోదని, ఇప్పుడే మొదలైయిందని చెప్పారు ప్రకాష్ రాజ్.