కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై ఇటీవల నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై సాయి పల్లవి వివరణ జూడ ఇచ్చారు. కాగా, సాయిపల్లవి ఇచ్చిన వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ఆమెకు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. ‘‘మానవత్వమే అన్నింటికంటే ముందు.. కాబట్టి సాయిపల్లవి.. మేము నీతోనే ఉన్నాం’’ అని ఆయన రాసుకొచ్చారు.
సాయిపల్లవి నటించిన కొత్త చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ కథలో ఆమె వెన్నెల పాత్రలో నటించి మెప్పించారు. ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ఇది నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కథ కదా..! మరి, మీరు లెఫ్ట్ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్ వింగ్‌కి మద్దతిస్తారా?’’ అని విలేకరి ప్రశ్నించగా.. ఆమె కశ్మీర్పండిట్స్, గోహత్యలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇది వివాదస్పదమైయింది.
Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3
— Prakash Raj (@prakashraaj) June 19, 2022