పరిపూర్ణానంద తనకు నగర బహిష్కరణ శిక్ష విధించడంపై.. హైకోర్టును ఆశ్రయించారు. అది సహజమే కానీ.. పరిపూర్ణానంద తరపున వాదించడానికి తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా పనిచేసి,రాజీనామా చేసిన దేశాయి ప్రకాశ్ రెడ్డి ముందుకు వచ్చారు. ఇది ప్రభుత్వానికి షాక్‌కు గురి చేస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం తరపును అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదిస్తున్నారు. పరిపూర్ణానంద తరపున దేశాయి ప్రకాశ్ రెడ్డి రంగలోకి దిగారు. ప్రకాశ్ రెడ్డి మొన్నటి వరకు తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు. కానీ వివాదాస్పద తీరిలో రాజీనామా సమర్పించాల్సి వచ్చింది.
అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో గొడవ చేశారంటూ.. ఎమ్మెల్యేలు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,సంపత్‌లపై స్పీకర్ అనర్హతా వేటు వేశారు. వారు కోర్టుకు వెళ్లడంతో.. విచారణలో.. కోర్టుకు వీడియోలు సమర్పిస్తామని.. అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు. తమకు అడగకుండా.. కోర్టుకు ఎలా చెబుతారని.. ప్రభుత్వ వర్గాలు.. ప్రకాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి కూడా.. ప్రకాష్ రెడ్డి తీరును సీరియస్‌గా పరిగణించి రాజీనామా లేఖ తీసుకున్నారు. కానీ ఆమోదించలేదు. రాజీనామా ఆమోదం పొందలేదన్న కారణంగా.. కొద్ది రోజులుగా ప్రాక్టీస్ చేయడం లేదు. నాలుగు నెలలుగా ఈ రాజీనామా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.
అయితే ప్రభుత్వమే కావాలని చేస్తోందన్న అనుమానంతో ఉందని భావిస్తున్న ప్రకాష్ రెడ్డి…ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిపూర్ణానంద కేసులో వాదించేందుకు రంగంలోకి దిగారు. వృత్తిలో భాగంగా ఒక న్యాయవాదికి ఎవరి కేసునైనా వాదించే హక్కు ఉంటుంది. కానీ ఆయన రాజీనామాను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా ఆమోదించకుండా నాలుగు నెలలుగా పెండిగ్ లో ఉంచి వృత్తికి అడ్డుపడుతున్నారన్న అసంతృప్తితోనే ఈ కేసు వాదించేందుకు రెడీ అయ్యారు. పరిపూర్ణానంద కేసులో ప్రకాశ్ రెడ్డి వ్యవహారం న్యాయవాదుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కేసు పరిపూర్ణానంద వ్యవహారం కాకుండా అడ్వకేట్ జనరల్ వర్సెస్ ప్రభుత్వంగా మారింది. రాజీనామాను ఆమోదించలేదు కాబట్టి.. ప్రకాష్ రెడ్డి ఇంకా ఏజీనే అనేవాళ్లు కూడా ఉన్నారు.