హైదరాబాద్: అత్తారింటికి దారేది, రభస వంటి పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించిన హీరోయిన్ ప్రణీత ఇవాళ యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఖమ్మంనుంచి ఆమె ఇన్నోవా కారులో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా నల్గొండ జిల్లా మోతె దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ప్రణీతకు, ఆమె తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమె అసిస్టెంట్ భాగ్యలక్ష్మికి మాత్రం పెద్ద గాయలే అయినట్లు తెలిసింది. ఆమెను 108 వాహనంలో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ప్రణీత, ఆమె తల్లి మరో కారులో హైదరాబాద్ బయలుదేరారు. ప్రణీత ప్రస్తుతం మహేష్ ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో, చుట్టాలబ్బాయి అనే మరో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కర్ణాటకకు చెందినవారు. నిన్న ఖమ్మంలో ఒక క్లాత్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
While on our way back from kammam. perfectly fine but unable to come out of the shock pic.twitter.com/b7TXWnULgz
— Pranitha Subhash (@pranitasubhash) February 14, 2016