ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే…ఆ రాష్ట్రంలో హడావిడి చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ రకంగా వ్యూహం రచించినవాడు ప్రశాంత్ కిషోర్. అదేదో సినిమాలో చిరంజీవి పాటలాగా ‘మంచమేసి…దుప్పటేసి..’ సాంగ్‌లాగా మంచాల ప్రచారానికి తెరతీశారు. రైతులందరికీ మంచాలేసి కూర్చోపెట్టి …వేదిక పై నుంచి ఈ దశాబ్ధపు బెస్ట్ కామెడీ పొలిటీషియన్ రాహుల్ గాంధీ చేత గొప్ప గొప్ప మాటలు మాట్లాడించారు. యాజ్ యూజువల్…..మా నాన్న గ్రేట్, మా నానమ్మ ఇంకా గ్రేట్…మా ముత్తాత సూపర్ గ్రేట్ అంటూ రాహుల్వారు తనకు తోచిన ప్రచారం మొదలెట్టేవారు. కొంతమంది రైతులు నిద్రపోయారు. మేలుకుని ఉన్న రైతులు మాత్రం ఎవరి మంచం వాళ్ళు తీసుకుని ఎంచక్కా చెక్కేయడం స్టార్ట్ చేశారు. ఆ దెబ్బతో రెండు మూడు సభలకే ఈ మంచాల ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు ప్రశాంత్ కిషోర్. మరెన్నో కొత్త కొత్త ఐడియాలను అప్లై చేశాడు. కానీ ది గ్రేట్ కమెడియన్ రాహుల్‌బాబా దెబ్బకు అవన్నీ కూడా కామెడీ అయిపోయాయి. కట్ చేస్తే ఉత్తరప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఘోర ఓటమి మూటకట్టుకుంది కాంగ్రెస్. తాను మునుగుతూ తనతో కలిసిన పాపానికి అశిలేష్ యాదవ్‌ని కూడా ముంచేశాడు రాహుల్ బాబా. ఈ మునకకు ఒక కారణంగా ప్రశాంత్ కిషోర్ నిలిచాడు.
2014లో మోడీని గెలిపించడం, ఆ తర్వాత బీహార్‌లో నితీష్‌ని గెలిపించడం లాంటి విషయాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్…వెంటనే ప్రశాంత్ కిషోర్‌ని తన ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా నియమించుకున్నాడు. కాస్త భారీగానే ముట్టచెప్పాడని కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ కూడా అనుభవం లేని వాడు అని విమర్శిస్తూ ఉండడంతో ప్రశాంత్ కిషోర్ అనుభవం తనకు కలిసొస్తుందని చెప్పి ప్లాన్ చేసినట్టున్నాడు. చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను తట్టుకోవాలంటే ఏ నాయకుడికి అయినా సాధ్యం అయ్యే పనేనా? ఎన్నికల వ్యూహాల విషయంలో మోడీని, అమిత్ షాలను కొట్టేటోడు దేశంలోనే లేడు అని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అలాంటి జోడీకే 2014 సీట్ల పంపకం విషయంలో, ఆ తర్వాత స్నేహపూర్వక పోటీతో ఝలక్ ఇచ్చిన ఘనాపాఠీ మన చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎదుర్కోవడానికే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను కోరుకున్నాడు జగన్. కానీ రాహుల్ గాంధీ దెబ్బకు ఆ ప్రశాంత్ కిషోర్ కూడా ట్రూ కమెడియన్‌గా మిగిలిపోయాడు. 2019 ఎన్నికలకు వైసిపి ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తే మాత్రం వైసిపి, నాయకులకు, కార్యకర్తలకే ఎన్నికల్లో గెలుపుపైన బోలెడన్ని అనుమానాలు వచ్చే పరిస్థితి. అదే జరిగితే మాత్రం ప్రశాంత్ కిషోర్ వళ్ళ ఒరిగేదేంటి అంటే చెప్పడం కష్టమే కానీ గొరిగేది మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. 2019 ఎన్నికలు వైఎస్ జగన్‌కి లైఫ్ అండ్ డెత్ లాంటివి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు కమెడియన్‌గా మిగిలిపోయిన ప్రశాంత్ కిషోర్‌ని ప్రచార వ్యూహకర్తగా నియమించుకునేంత సాహసం జగన్ చేస్తాడా? ఎవరి మాటా వినడు, తాను ఏం అనుకుంటే అదే చేసుకుంటూ పోతాడు అని జగన్‌పైన గట్టి విమర్శ ఒకటి ఉంది. అలాంటి జగన్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.