చంద్రబాబు రాజకీయం ఎక్కడ ఫెయిలయింది. జగన్ రాజకీయం ఎక్కడ సక్సెస్ అయింది. ఇద్దరిలో తేడా ప్రశాంత్ కిషోర్ కావొచ్చు. మారుతున్న రాజకీయాలకు తగ్గట్లుగా మార్చుకున్న జగన్.. ప్రశాంత్ కిషోర్ అనే స్ట్రాటజిస్ట్కు ను తెచ్చుకున్నారు. గతంలో మోడీని గెలిపించారని… నితీష్ ను గెలిపించారని.. ఇలా రకరకాలుగా తనదైన శైలిలో ప్రచారం పొందిన ఆ బీహారీ బాబు… జగన్కు… స్ట్రాటజిస్ట్ గాఉండటానికి.. తన ఐప్యాక్ సంస్థ ద్వారా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పంద విలువ ఎంతో తెలియదు కానీ.. వందల కోట్లలోనే ఉందని.. ఆ సంస్థ ద్వారా జరిగిన సర్వేలు..సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తే అర్థమవుతుంది.
అంతే కాదు… చివరికి వచ్చే సరికి పార్టీ కార్యక్రమాలు కూడా…ఐ ప్యాక్ టీంకే అప్పగించారు. సర్వేలు చేసి.. అభ్యర్థుల ఎంపిక చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు. పార్టీ పూర్తిగా ఐ ప్యాక్ టీం అదుపులోకి వెళ్లింది. దాంతో… వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అవకాశం లేకుండా పోయింది. ఐ ప్యాక్ టీం.. అన్ని సమీకరణాలను చూసుకుని.. అభ్యర్థులను ఎంపిక చేసింది. సోషల్ మీడియాలో అగ్రెసివ్ ప్రచారం చేసింది. ఓ పాట కోసం.. కోటి వ్యూస్ తెప్పించడానికి ఐప్యాక్ టీం పన్నిన వ్యూహం.. సూపర్.
ప్రజల్లో.. ఓటర్లలోఓ రకమైన భావోద్వేగం తెప్పించాడనికి ప్రశాంత్ కిషోర్ టీం అద్భుతంగా పని చేసింది. దానికి తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి. వైసీపీ విజయంలో జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని తక్కువ అంచనా వేయలేం కానీ.. ఆయనకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ చేయడంలో.. పీకే టీం మాత్రం.. చాలా బాగా పని చేసింది. అది ఫలితాల్లో కనిపించింది.