బీహార్ కన్నా తమిళనాడు రాజకీయాల మీదే ప్రశాంత్ కిషోర్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా ఉన్నారు. తన సొంత రాష్ట్రంలో గెలిచి సీఎం అవడం కన్నా తమిళనాడులో విజయ్ ను గెలిపించి ధోనీ అవుతానని అంటున్నారు. విజయ్ టీవీకే పార్టీ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ నేరుగా పాల్గొన్నారు. ప్రసంగించారు. తాను విజయ్ తో మాట్లాడినప్పుడు తమిళనాడు ప్రజల జీవితాలను మార్చేందుకు మంచి ఐడియాలజీతో వచ్చాడని గుర్తించానన్నారు. సీఎస్కేను ధోనీ గెలిపించినట్లుగా.. తాను విజయ్ టీవీకేను గెలిపించి పొలిటికల్ ధోనీగా గుర్తింపు పొందుతానన్నారు.
ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్థలో లేరు. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. ఇంకా చెప్పాలంటే అసలు స్ట్రాటజిస్టుగా పనులు మానేసి రాజకీయాలు చేస్తున్నారు. బీహార్ లో సొంత పార్టీ పెట్టి ఆమరణదీక్షలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలోనే బీహార్ లోనే ఎన్నికలు జరగనున్నాయి. అయినా వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికలు, అందులో విజయ్ పార్టీని గెలిపించడంపై దృష్టి పెట్టారు. పూర్తి స్థాయి స్ట్రాటజిస్టుగా మళ్లీ పని చేస్తున్నారని అనుకోవచ్చు.
ఇటీవల వస్తున్న సర్వేల్లో విజయ్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ విజయ్ కు మైలేజీ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. డీఎంకే తరహాలో టీవీకే కూడా పొత్తులతో .. ముఖ్యంగా అన్నాడీఎంకేతో కలిసి పనిచేస్తే డీఎంకు ప్రత్యామ్నాయంగా సులువుగా ప్రజలు అంగీకరిస్తారని అంటున్నారు. అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి కూడా దానికి రెడీగానే ఉన్నారని అంటున్నారు.