ఎన్నికలు వచ్చాయి. అందరూ రాజకీయం చేస్తున్నారు. విచిత్రంగా బీఆర్ఎస్ రాజకీయం మాత్రం ఎక్స్ ట్రీమ్ లెవల్ కు చేరుకుంటోంది. అది సోషల్ మీడియా ప్రచారం అయినా.. క్షేత్ర స్థాయిలో ప్రచారం అయినా సరే. అదే సమయమంలో బీఆర్ఎస్ నేతలు దాడులకు గురయ్యామని ఆస్పత్రుల్లో చేరిపోవడం కూడా ఆసక్తికరంగా మారుతోంది.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వలబాలరాజు తనపై దాడి జరిగిందని అపోలో ఆస్పత్రిలో చేరిపోయారు. ఆయనను అడ్మిట్ చేసుకునేంత పెద్దగాయాలయ్యాయో లేదో కానీ.. ఆయనకు పరామర్శలు పెరిగిపోయాయి. తన దవడకు గాయం అయిందని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. బుగ్గకు ప్లాస్టర్ వేసుకున్నారు. కానీ అంతకు ముందు ఆయనను ఆస్పత్రిలో చేర్చినప్పుడు కానీ… నాయకులు పరామర్శించినప్పుడు కానీ ఆ ప్లాస్టర్ లేదు.. గాయం కూడా లేదు. దీంతో బాలరాజు ట్రోలింగ్ కు గురవుతున్నారు. ఇంతముందు కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆ ఘటన జరిగిన వెంటనే అందరికీ కోడికత్తి ఘటనే గుర్తుకు వచ్చింది. నామినేషన్ కు .. కొత్తప్రభాకర్ రెడ్డి వీల్ చైర్ లో వచ్చారు. దీంతో ట్రోలింగ్ చేసే వారు చేస్తున్నారు.
ఈ ఘటనలన్నీ ప్రశాంత్ కిషోర్ స్క్రిప్టులని కానీ ప్రజలు నమ్మే పరిస్థితి పోయిందని రేవంత్ రెడ్డి అంటున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో మరిన్ని కుట్రలు, డ్రామాలు బీఆర్ఎస్ నేతలు చేయబోతున్నారని చెబుతున్నారు. కారణం ఏదైనా… తెలంగాణ రాజకీయాల్లో బిజానే ఇన్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. నిజమేంటో కానీ… కోడికత్తి దాడి ఘటన ఏ మాత్రం నమ్మశక్యంగా లేపోయినా జగన్ రెడ్డికి సానుభూతి వచ్చిందని… అందుకే..త నెగెటివ్ గా ఎంత ప్రచారం జరిగినా ఆస్పత్రి సీన్లు హైలెట్ అవుతాయని.. బీఆర్ఎస్ నేతలు మాత్రం నమ్మకంగా ఉన్నారు.