ఓడిపోతామని ఎ రాజకీయ నాయకుడు చెప్పడు.. చివరికి నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కూడా తమ ఓటమిని అంగీకరించరు అని.. స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జగన్ మోహన్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ కు ఆదివారం పీకే ఇంటర్యూ ఇచ్చారు. ఇందులో దేశ రాజకీయాలతో పాటు జగన్ గురించి ప్రస్తావన వచ్చింది.
జగన్ ఘోరంగా ఓడిపోతారని పదే పదే అంచనా వేస్తున్నారు.. మరి జగన్ గెలుస్తున్నారని ఆయన చెబుతున్నారని బర్ఖాదత్ ప్రశ్నించారు. దానికి కౌంటింగ్ కు ముందు ఓటమిని ఒప్పుకున్న ఒక్క రాజకీయ నేత లేడని గుర్తు చేశారు. సంఖ్యలపై వాదించడంలో అర్థం లేదని నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుందన్నారు. తన అంచనాలు తప్పయితే ప్రశాంత్ కిషోర్ అనే ఇమేజ్‌పై మరక పడుతుందని .. ఒక వేళ తన అంచనాలు నిజమైతే బెంగాల్లో అమిత్ షా సవాల్‌ని ఎలా ఓడిపోయారో అలాగే జగన్ రెడ్డిపై కూడా మరక పడుతుందని సెటైర్లు వేశారు.
తనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి అంచనాలు చెయ్యడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటానని స్పష్టం చేశారు. సీట్లు ఎవరికీ ఎంత వస్తయి అన్నాది నేను చాలా అరుదుగా చెప్తాను. జగన్ ఓడిపోతున్నాడు అని ఖచ్చితంగా చెప్పగలనన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలపై జగన్ ఫీలయ్యారు. ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి… ప్రశాంత్ కిషోర్ ది ఏమీ లేదని.. చెప్పుకొచ్చారు. తాము గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు దానికి పీకే ఇలా కౌంటర్ ఇచ్చారు.