ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను స్ట్రాటజిస్ట్‌గా రిటైర్ అవుతున్నానని పీకే ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆయన బీహార్‌లో తన రాజకీయ భవిష్యత్‌ను వెదుక్కుంటున్నారు. ఐ ప్యాక్‌ను ఆయన శిష్యులు నడుపుతున్నారు. అయితే తెలంగాణ విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి దిగారు. కానీ ఏమైందో కానీ హఠాత్తుగా పీకే టీములు తెలంగాణను వదిలి వెళ్లిపోయాయి.
స్ట్ ప్రశాంత్ కిషోర్‌పై కేసీఆర్ కురిపించిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. అటు ఫాం హౌస్‌లో ఇటు ప్రగతి భవన్లో పీకేతో గంటల తరబడి చర్చించారు. ఐ ప్యాక్ టీంతో కలిసి పని చేస్తున్నామని.. ఆయన ఉచితంగా పని చేయడానికి అంగీకరించారని కేసీఆర్ ప్రకటించారు. ఓ సారి కాంట్రాక్ట్ తీసుకుని పని చేయడం ప్రారంభించిన తర్వాత మొదటి సారి పీకే టీం సేవల్ని వద్దనుకున్నది టీఆర్ఎస్సే అనుకోవచ్చు. వారికి ఉన్న ట్రాక్ రికార్డు అలాంటిది. అయితే ఇలా ఎందుకు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింద.
పీకేను స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకోవడం వల్ల జాతీయ స్థాయిలో క్రేజ్ వస్తుందని కేసీఆర్ అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా తయారైంది. కేసిఆర్ ను జాతీయరాజకీయాల్లో బాగా ఎక్స్ పోజ్ చేసే స్ట్రాటజీలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇది కేసీఆర్‌కు అసంతృప్తిని కలిగించింది. జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ కు పీకే చేసే హెల్ప్ కూడా ఏమీ లేదనీ అర్థమైపోయిది. తెలంగాణ వరకూ అయితే.. తాను చాలని.. పీకే ఎందుకని కేసీఆర్ అనుకున్నారు. అందుకే వారి సేవల్ని వద్దనుకున్నట్లుగా భావిస్తున్నారు. కేసీఆర్ నిర్ణయం జగన్‌కు కలిసి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నవారంతా ఏపీలో మకాం వేస్తున్నారు.