ఒక సినిమాకి జోనర్ సెట్ చేయడం చాలా ముఖ్యం. ఏ జోనర్ సినిమా అనేది ప్రేక్షకులకు క్లియర్ గా తెలియాలి. అందుకే సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడే ప్రెస్ నోట్ లో చాలా క్లియర్ గా ఈ సినిమాలో ఏ జోనర్ లో వుండబోతుందనేది చెబుతారు. కొన్ని సినిమాలు మాత్రం విడుదలకు సిద్ధమైనంత వరకూ ఆ సినిమా జోనర్ ఏమిటనేది ప్రేక్షకులకు క్లారిటీ వుండదు. దీనికి వెనుక ప్రమోషన్ మెటిరియల్ రాకపోవడం, ఉప్దేట్స్ లేకపోవడం, ప్రోపర్ గా పీఆర్ వర్క్ జరక్క పోవడం.. ఇలా చాలా కారణాలు వుంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా ఎదురుచూస్తున్న ‘సలార్’ సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఎదురైయింది.
సలార్ టీజర్ ట్రైలర్ చూసి ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అనుకోని అలాంటి కీ వర్డ్స్ తోనే ఆర్టికల్స్ వచ్చాయి. ప్రెస్ నోట్స్ లో కూడా ఈ సినిమా జోనర్ ని యాక్షన్ థ్రిల్లర్ అనే చెప్పారు. వికీపిడియాలో కూడా యాక్షన్ థ్రిల్లర్ అనే వుంది. అయితే ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ పెద్ద బాంబ్ పేల్చాడు. సలార్ జోనర్ ‘డ్రామా’ అని ఒకటికి పదిసార్లు చెప్పాడు ప్రశాంత్ నీల్.
రాజమౌళితో జరిగిన ఇంటర్వ్యూలో తొలి పదినిమిషాలు ఈ సినిమా జోనర్ గురించే వుంది. ‘సలార్.. ఒక మంచి డ్రామా. కానీ అది ట్రైలర్ సరిగ్గా చెప్పలేకపోయాననిపిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా టెన్షన్ వుంది. ఆ ట్రైలర్ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అయ్యిందో తెలీదు. ఖాన్సర్ చుట్టూ ఒక బలమైన డ్రామా వుంది. ప్రభాస్, పృద్వీరాజ్, శ్రుతి హసన్, ఈశ్వరి రావు, జగపతి బాబు.. ఇలా ఐదు పాత్రల చుట్టూ నడిచే డ్రామా ఇది” అని చాలా క్లారిటీగా చెప్పారు ప్రశాంత్ నీల్.
ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సలార్ ని డ్రామా మూవీగానే ట్రీట్ చేయాలని చెప్పాడు. ‘నా ద్రుష్టిలో సలార్ గేమ్ ఆఫ్ త్రోన్స్ తరహా డ్రామా. చాలా పాత్రలు వుంటాయి, వాటి చుట్టూ వున్న కోర్ ఎమోషన్, డ్రామా ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఇందులో ప్రతి పాత్రని ప్రశాంత్ నీల్ రాసుకున్న విధానం నాకు సర్ప్రైజ్ ఇచ్చింది” అని చెప్పుకొచ్చాడు.