‘స‌లార్ 2’.. ఇంకాస్త ముందే!

ప్ర‌భాస్ అభిమానుల విజ‌య దాహాన్ని తీర్చింది ‘స‌లార్’. ప్ర‌శాంత్ నీల్ మ‌రోసారి త‌న మేకింగ్ తో అద‌ర‌గొట్టాడు. స‌లార్‌పై కొన్ని అసంతృప్తులు ఉన్నా, బాక్సాఫీసు విజ‌యాన్ని ఆప‌లేక‌పోయాయి. ఇప్పుడు అంద‌రి దృష్టీ ‘స‌లార్ 2’పైనే ఉంది. నిజానికి ‘స‌లార్ 1’కీ, ‘స‌లార్ 2’కీ మ‌ధ్య కాస్త బ్రేక్ తీసుకొని, మ‌రో సినిమా పూర్తి చేద్దామ‌నుకొన్నాడు ప్ర‌శాంత్ నీల్. 2025లో స‌లార్ 2 మొద‌లెడ‌దామ‌నుకొన్నాడు. అయితే ఆ ప్లానింగ్ మారింది. ముందు స‌లార్ 2 పూర్తి చేసి, ఆ త‌ర‌వాతే.. మిగిలిన ప్రాజెక్టుల్ని ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు. ఈ యేడాదే ‘స‌లార్ 2’ ప‌నులు మొద‌ల‌వుతాయ‌ని తెలుస్తోంది. 2025 చివ‌ర్లో ‘స‌లార్‌ 2’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే ఛాన్సుంది.

‘స‌లార్ 2’కి సంబంధించి ఇప్ప‌టికే కొంత షూటింగ్ అయ్యింది. పైగా ‘స‌లార్‌’ కోసం వేసిన కొన్ని సెట్లు అలానే ఉన్నాయి. అందుకే ఈ వేడిలోనే ‘స‌లార్ 2’ పూర్తి చేస్తే మంచిద‌న్న‌ది ప్ర‌శాంత్ నీల్ భావ‌న‌. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల కోసం ప్ర‌శాంత్ నీల్ కొన్ని క‌థ‌లు సిద్ధం చేసుకొంటున్నాడు. వీటిలో ఎన్టీఆర్ సినిమానే ముందుగా మొద‌ల‌వుతుంది. ‘దేవ‌ర‌’ త‌ర‌వాత ఎన్టీఆర్ చేసే సినిమా ప్ర‌శాంత్ నీల్ తోనే. ‘దేవ‌ర‌’ కూడా పార్ట్ 2 ఉంది కాబ‌ట్టి, ఎన్టీఆర్ అందుబాటులోకి రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి… ‘స‌లార్ 2’పై ప్ర‌శాంత్ ఫోక‌స్ చేస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close