కేజీఎఫ్‌తో.. తానేంటో నిరూపించుకున్నాడు ప్రతాంత్ నీల్. ఓ కన్నడ చిత్రానికి పాన్ ఇండియా ఖ్యాతి తీసుకొచ్చి… అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్నాడు. కథని చెప్పే విధానం, టేకింగ్, హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన పద్ధతి.. ఇవన్నీ బాగా నచ్చేశాయి. కేజీఎఫ్ తరవాత.. ప్రశాంత్ కి వచ్చిన క్రేజ్… అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ స్టార్లు… ప్రశాంత్ తో సినిమాలు చేయడానికి ఎగబడ్డారు. అయితే.. టాలీవుడ్ హీరోలు మాత్రం ఓ అడుగు ముందుకేసి తమ వైపుకు లాగేసుకున్నారు.
ప్రశాంత్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్.. తెలుగులోనే సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పటికే `సలార్`ని పట్టాలెక్కించేశాడు. సలార్ తరవాత.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి రూట్ క్లియర్ అయిపోయింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఆ తరవాత.. రామ్ చరణ్ తో ప్రశాంత్ ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. `కేజీఎఫ్` తరవాత.. చరణ్ – ప్రశాంత్ మధ్య భేటీ జరిగింది. సినిమా చేద్దామని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. కాకపోతే.. వరుస కమిట్మెంట్స్ వల్ల పట్టాలెక్కడానికి ఆలస్యం అవుతోంది. కాకపోతే… ఎన్టీఆర్ తో సినిమా అవ్వగానే చరణ్ తో మూవీ పక్కా. అంటే.. ప్రశాంత్ నీల్ వరుసగా టాలీవుడ్ లోనే మూడు సినిమాలు చేయబోతున్నాడన్నమాట.