తనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేసిన ప్రవీణ్ ప్రకాష్…ఆ షోకాజ్ నోటీస్‌కు.. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్కు సమాధానం ఇచ్చారు. తన తప్పేం లేదని.. అంతా ఎల్వీదేనని.. పరోక్షంగా.. ప్రవీణ్ ప్రకాష్ ఆ వివరణలో వెల్లడించారు. కేబినెట్ ఎజెండాలో.. నిబంధనలకు విరుద్ధంగా.. వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అవార్డులు అంశాన్ని చేర్చడం… అజెండాలోఉన్న గ్రామ న్యాయాలయాల అంశాన్ని సీఎం పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తీసేయడంతో.. సీఎస్‌గా ఉన్న… ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఇలా ఇవ్వడంతో.. ఆయనను ప్రవీణ్ ప్రకాష్ బదిలీ చేశారు. అయితే.. ఆ షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండటంతో.. అధికారంగా.. నీరబ్ కుమార్‌కు వివరణ పంపారు.
తాను అంతా అంతా నిబంధనల ప్రకారమే చేశానని వివరణలో ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అవార్డుల అంశానికి ఆర్థికశాఖ అనుమతి ఉందన్నారు. దీన్ని సీఎస్‌కు కూడా చెప్పానన్నారు. గ్రామ న్యాయాలయాల అంశం… చిన్నది కావడంతో.. సీఎస్‌కు తర్వాత చెప్పొచ్చనుకున్నానని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఓ రకంగా.. ప్రవీణ్ ప్రకాష్.. తన వివరణలో… ఎల్వీ సుబ్రహ్మణ్యమే తప్పు చేశారని స్పష్టం చేశారు. ఆయనకు చెప్పే… వైఎస్ఆర్ అవార్డుల అంశాన్ని కేబినెట్లో పెట్టానని చెప్పడం… వివరణలో కీలకాంశం. ఎందుకంటే.. తనకు తెలియకుండానే.. అంతా చేశారని.. ఎల్వీ షోకాజ్ ఇచ్చారు.
ఈ వివాదం… ఏపీ అధికారవర్గాల్లో ఓ కలకలానికి కారణం అయింది. ప్రవీణ్ ప్రకాష్ వివరణతో అది మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో టీడీపీ పాలనలో మంచిపోస్టులు పొందిన వారంతా.. ఇప్పుడు లూప్ లైన్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఎల్వీకి సన్నిహితులుగా పేరు పడిన వారంతా….లూప్ లైన్ లోకి వెళ్లనున్నారు. త్వరలో కొన్ని బదిలీలు జరగనున్నాయని చెబుతున్నారు.