జగన్‌రెడ్డిని గుడ్డిగా నమ్మి ఏడేళ్ల ముందే ఐఏఎస్ పదవిని వదులుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. వివాదాస్పదమైన అధికారిగా ఉన్న ఆయన టీచర్లను రాచి రంపాన పెట్టి జగన్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. కొన్ని స్కాముల్లోజైలుకు పోవాల్సిన ఆయనను కూటమి ప్రభుత్వం .. వదిలేసింది . ఆయన వీఆర్ఎస్ తీసుకుంటానని బెదించాలని అనుకున్నారేమో కానీ అలాగే చేశారు. కానీ ఆయనను బతిమాలాలని ఎవరూ అనుకోలేదు. రిటైర్మెంట్ ఇచ్చేశారు.
మధ్యలో రిటైర్మెంట్ వద్దని సర్వీసులో చేరుతానని తెలిసిన వాళ్లతో లాబీయింగ్ చేశారు కానీ ఆయన వ్యవహారాలపై పూర్తిగా అవగాహన ఉన్న ప్రభుత్వపెద్దలు ఎంటర్ టెయిన్ చేయలేదు. దీంతో వీఆర్ఎస్ అమలైపోయింది. సెప్టెంబర్ 30వ తేదీనే ఆయన లాస్ట్ వర్కింగ్ డే. అయితే ఆయన వీఆర్ఎస్ తీసుకుని మంచి పని చేశారని..లేకపోతే కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడాల్సి వచ్చేదన్న అభిప్రాయం కూడా ఇతర అధికారుల్లో ఉంది.
ఇతర అధికారులకు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇంకా ఉన్న రెండేళ్ల సర్వీసును వదిలేసుకుని వెళ్లిపోతానని వీఆర్ఎస్ ఇచ్చేయలాని పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వ పెద్దల వద్దకు రాయబారం పంపారు కానీ ఆయన చేసిన పనులు చిన్నవి కాదు కాబట్టి వదిలే అవకాశాలు ఎంత మాత్రం ఉండవు. అలాగే ఎంతో సర్వీస్ ఉన్న అధికారులు కూడా తాము చేసిన తప్పులకు ఎన్నో కష్టాలు పడాల్సి ఉంది.