ఎల్.బి.డబల్యు, చందమామ కథలు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రవీ ణ్ సత్తారు. ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూర్ టాకీస్ తో అయితే తనలో ఉన్న కమర్షియల్ యాంగిల్ తో మరింత క్రేజ్ సంపాధించాడు. సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా లేకున్నా యూత్ కి బాగా ఎక్కింది మరి అది చాలదా ఓ దర్శకుడి టాలెంట్ ను గుర్తించడానికి. ఇక గుంటూర్ టాకీస్ హిట్ ఇచ్చిన జోష్ లో ఉన్న ప్రవీణ్ లవర్ బోయ్ సిద్దార్థ్ తో ఓ సినిమా చేస్తున్నాడని టాక్.
ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా నడిశాయని తెలుస్తుంది. బొమ్మరిల్లుతో లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత తెలుగులో హిట్ కొట్టలేదు సరికదా మీడియాతో దురుసుగా ప్రవర్తించాడని మనవాడిని కస్త పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం తారక్ బాద్షా సినిమాలో కనిపించిన సిద్ధు డైరెక్ట్ తెలుగు సినిమా కోసమే ఇన్నాళ్ల నుండి చూస్తున్నాడు. ఓ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించబడుతున్న ఈ సినిమాకు సంగీతానికి సంబంధించి కూడా ఎక్కువ స్కోప్ ఉన్నదట, అంతేకాదు సినిమాకు లడక్, హైదరాబాద్, శ్రీశైలం ఏరియాల్లో షూటింగ్ చేస్తారట. మరి చాన్నళ్ల తర్వాత ఓ క్రేజీ దర్శకుడి కథకు ఓకే చెప్పిన సిద్ధార్త్ ఈ సినిమాతో తెలుగులో ఇదవరకు వచ్చిన క్రేజ్ సంపాధిస్తాడు లేదో చూడాలి.