చెరువు జాగ్రత్తల్లో హైదరాబాద్ ఇళ్ల కొనుగోలుదారులు !

హైదరాబాద్‌లో ఇళ్లు కొనాలనుకునేవారు కొత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేక్ వ్యూ అని ఆశపడకుండా… అసలే లేక్ కు ఎంత దూరంలో తమ ఇల్లు ఉందో ఆరా తీసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇళ్ల కొనుగోలు చేసిన వారికి.. కొనుగోలు చేయాలనుకునేవారికి అవగాహన కల్పించేందుకు హెచ్‌ఎండీఏ https://lakes.hmda.gov.in/పేరుతో వెబ్ సైట్ పెట్టి అందులో అన్ని చెరువుల వివరాలను పెట్టింది. ఫుల్ ట్యాంక్ లెవల్.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వంటి వాటినీ మార్క్ చేసి ఉంచారు. ఆ పరిధిలో కి ఇళ్లు ఉన్నా.. అమ్మకానికి ఆఫర్ ఇచ్చినవి ఉన్నా ఆశలు వదిలేసుకోవడం మంచిది.

హైడ్రా దూకుడు తర్వాత ఈ వివరాలు సరి చూసుకుని చాలా మంది కొత్త ప్రాజెక్టుల్లో ఒప్పందాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అమీన్ పూర్ పరిధిలో చెరువుల తూముల్ని ఆక్రమించి హైరైజ్ అపార్టుమెంట్లు కడుతున్న ఓ కంపెనీకి సగానికి పైగా బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇతర చోట్ల కూడా అంతే. ప్రజల్లో ఈ మాత్రం చైతన్యం రావడం ఎంతో మంచిదన్న అభిప్రాయం రియల్ ఎస్టేట్ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది.

సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు రాజకీయ బలంతో… లంచాలు ఇచ్చి చెరువుల్లో కట్టడాలు పూర్తి చేసిసామాన్యులకు అమ్మేస్తూంటాయి. దాని వల్ల కబ్జాదారులు బాగుపడుతున్నారు కానీ.. వాటిని కొన్న సామాన్యులు మాత్రం తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొత్త బాధితులు రాకుండా ఉండేందుకు హైడ్రా చేపట్టిన చర్యలు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఇక నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా తమ ప్రాజెక్టు చెరువుకు ఎంత దూరమో.. ఫుల్ ట్యాంక్ లెవర్.. బఫర్ జోన్ పరిధిలోకి ఎలా రావో చెబుతూ.. ప్రత్యేకమైన బ్రోచర్లను కస్టమర్లకు పంచాల్సిన పరిస్థితి వచ్చిందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close